HyderabadPoliticalRangareddyTelangana

రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్

రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్

రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్

Web desc : మొయినాబాద్ మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. లంచం డిమాండ్ చేసి స్వీకరించిన కేసులో టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న గుండు వాణి (AO-1) ఓ నిర్మాణానికి సంబంధించి ఫిర్యాదుదారుడిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా, ఆ నిర్మాణాన్ని అక్రమంగా పరిగణించకుండా అధికారిక సహాయం చేయడానికి రూ.75,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ మొత్తాన్ని మొయినాబాద్ గ్రామపంచాయతీ మాజీ పంచాయతీ కార్యదర్శి, ప్రస్తుతం మొయినాబాద్ మున్సిపాలిటీలో డిప్యూటేషన్‌పై సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఏలమోని సుదర్శన్ (AO-2) ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది.

2026 సెప్టెంబర్ 30న ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి లంచం డిమాండ్ చేసి, సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్ ద్వారా రూ.75 వేల నగదును స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆ లంచం మొత్తాన్ని సుదర్శన్ వద్ద నుంచి అతని చూపిన మేరకు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా, అనుచిత ప్రయోజనం పొందేందుకు అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

న్యాయ రిమాండ్‌కు తరలింపు

ఏసీబీ కేసులో నిందితులైన AO-1 గుండు వాణి, AO-2 ఏలమోని సుదర్శన్‌లను నాంపల్లిలోని SPE & ACB కేసుల కోసం గౌరవ I అదనపు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button