PoliticalTelanganaWarangal

'మూడు సార్లు అబార్షన్.. పెళ్లికి నిరాకరణ'.. ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన

'మూడు సార్లు అబార్షన్.. పెళ్లికి నిరాకరణ'.. ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన

‘మూడు సార్లు అబార్షన్.. పెళ్లికి నిరాకరణ’.. ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన

Web desc : ప్రేమ పేరుతో మోసం చేశారంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది. ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ.. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

శ్రీకాంత్ తనతో సన్నిహితంగా ఉండి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడని యువతి ఆరోపించింది. తనతో సంబంధం కొనసాగిన సమయంలో మూడు సార్లు అబార్షన్లు చేయించాడని ఆమె ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకోకుండా మాట దాటవేస్తూ తనను మోసం చేశాడని పేర్కొంది.

ఈ విషయంపై పలుమార్లు న్యాయం కోసం ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది. దీంతో నేరుగా మున్సిపల్ ఛైర్మన్ ఇంటి వద్దకు వచ్చి నిరసన చేపట్టినట్లు వెల్లడించింది. తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ యువతి ఛైర్మన్ ఇంటి ఎదుట ఆందోళన కొనసాగించింది.

‘పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ పాలకుర్తి నేను మూడేళ్లు ప్రేమించుకున్నాం. ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పటంతోనే నేను అన్ని విధాలుగా ప్రొసీడ్ అయ్యా. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి వాళ్ల ఇంట్లో వాళ్లతో కూడా పరిచయాలు చేపించాడు. గుడికి తీసుకెళ్లి అక్కడకు తీసుకెళ్లి ప్రామిస్ చేశాడు. వాళ్ల చెల్లి వాళ్లు కూడా నన్ను వదినా అని పిలిచేవారు.

ఆ తర్వాత శారీరకంగా వాడుకున్నాడు. వాళ్ల ఫ్రెండ్స్ కూడా ఉండి అబార్షన్ పిల్స్ వేశారు. పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పుడైతే పిల్స్ వేసుకో అని శ్రీకాంత్‌తో పాటు అతడి ఫ్రెండ్స్ బలవంతం చేశారు. వాళ్ల నాన్న మున్సిపల్ ఛైర్మన్ అయ్యాక శ్రీకాంత్ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు.

వాళ్ల నాన్నను కలిసి అన్ని ఆధారాలు బయటపెట్టిన. అయినా వాళ్లు స్పందించలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సార్‌ను కలిసి నా గోడు వినిపించా. ఎమ్మెల్యే కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పినా శ్రీకాంత్ మాట వినలేదు. చాలా ట్రై చేసినా కూడా నన్ను పెళ్లి చేసుకోవటానికి శ్రీకాంత్ ఒప్పుకోవటం లేదు. పెళ్లి చేసుకుంటానంటే నమ్మా.. కానీ ఇలా చేస్తాడనుకోలేదు.

నాకు న్యాయం కావాలి.’ అని బాధిత యువతి మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, పలువురు స్థానికులు అక్కడికి చేరుకుని యువతికి సంఘీభావం తెలిపారు. ఆమెకు న్యాయం జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరారు.

ఇప్పటికే ఈ విషయంపై ఎమ్మెల్యేను ఆశ్రయించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని యువతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు సీరియస్‌గా తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. ఈ ఘటనతో వర్ధన్నపేటలో రాజకీయంగా కూడా చర్చ మొదలైంది.

యువతి చేసిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల నుంచి పూర్తి వివరణ రావాల్సి ఉంది. ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది. యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపడితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button