NizamabadPoliticalTelangana

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మ*హత్యాయత్నం చేసిన టీస్టాల్‌ నిర్వాహకుడు మృ*తి

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మ*హత్యాయత్నం చేసిన టీస్టాల్‌ నిర్వాహకుడు మృ*తి

పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మ*హత్యాయత్నం చేసిన టీస్టాల్‌ నిర్వాహకుడు మృ*తి

Web desc : పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలతో నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిన టీస్టాల్‌ యజమాని పొలాస సుధాకర్‌(55) మృతి చెందాడు. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోగా, 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రితో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుధాకర్‌ పట్టణంలో స్థానికంగా టీస్టాల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, షాపు ముందు టేబుళ్లు వేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నాడంటూ అతడిని పలుమార్లు పోలీసులు స్టేషన్‌కు పిలిచినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

వారి ఇబ్బందులను తట్టుకోలేక సుధాకర్‌ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని, ఆదివారం సైతం పోలీసులు ఫోన్‌ చేసి స్టేషన్‌కురావాలని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడని చెబుతున్నారు. తన వద్ద సిగరెట్లు కొనడంలేదనే అక్కసుతో టీషాపు ఎదురుగా ఉన్న కిరాణా దుకాణ యజమానే.. పోలీసులతో తరచూ స్టేషన్‌కు పిలిపించేలా చేశాడని బాధితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

సుధాకర్‌ మృతికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో బంద్‌ నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. బాధితుడికి నివాళులు అర్పించేందుకు యత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బందోబస్తు నడుమ సుధాకర్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సుధాకర్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని.. భీంగల్‌ ఎస్సై ని డిస్మిస్‌ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button