HyderabadPoliticalRangareddyTelangana

రంగారెడ్డి డీఎంహెచ్‌వో పై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి డీఎంహెచ్‌వో పై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి డీఎంహెచ్‌వో పై సస్పెన్షన్ వేటు

Web desc : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణకుమారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీజ్ చేసిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని తిరిగి తెరిచేందుకు తన కారు డ్రైవర్ ద్వారా నగదు డిమాండ్ చేసిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆమెను వలపన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే.

అనంతరం ఆమెతోపాటు మరో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో డీఎంహెచ్‌వో స్వర్ణకుమారిపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టింది.

ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న స్వర్ణకుమారి గతంలో ఇదే జైలులో వైద్యురాలిగా విధులు నిర్వర్తించారు. 2005 నుంచి 2013 వరకు జైళ్ల శాఖ శిక్షణ సంస్థలో ఆమె వైద్యురాలిగా పని చేశారు. ఈ సమయంలో కొన్ని రోజులపాటు డిప్యూటేషన్‌పై చంచల్‌గూడ జైలులో వైద్యురాలిగా పని చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button