KhammamPoliticalTelangana

ఏన్కూరులో అదుపుతప్పిన డీసీఎం వాహనం

ఏన్కూరులో అదుపుతప్పిన డీసీఎం వాహనం

ఏన్కూరులో అదుపుతప్పిన డీసీఎం వాహనం

లచ్చగూడెం వద్ద ఘటన.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ అక్టోబర్ 13 2026: ఏన్కూరు మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీ పరిధిలోని లచ్చగూడెం వద్ద డీసీఎం వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో డీసీఎం అదుపుతప్పినట్లు డ్రైవర్ తెలిపాడు.

అయితే డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు ఆహ్వానించినట్లే! రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండటంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల డ్రైవర్లతో పాటు ఇతర ప్రయాణికులు, వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకులు ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఏర్పడతాయి.
లచ్చగూడెం వద్ద జరిగిన ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌తో పాటు ఇతరులెవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button