HyderabadPoliticalTelangana

రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ రెవెన్యూ అధికారులు

రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ రెవెన్యూ అధికారులు

రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ రెవెన్యూ అధికారులు

Web desc : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్‌ బతుక శ్రీనివాసులు ఎసిబి అధికారులకు చిక్కారు. అధికారిక పని చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వారిని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్ పేట్ రెవెన్యూ పరిధిలో ఫిర్యాదు దారుడికి సంబంధించిన భూమిని హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం సర్వే చేసి, జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేసేందుకు అధికారులు లంచం డిమాండ్‌ చేశారు.

రూ.30 లక్షలు లంచంగా డిమాండ్‌ చేయగా, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో అక్టోబర్‌ 12న సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామం, మండల పరిధిలో మండల సర్వేయర్‌ బతుక శ్రీనివాసులు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డి సూచనల మేరకే సర్వేయర్‌ లంచం స్వీకరించినట్లు ఎసిబి ప్రకటనలో పేర్కొంది.

లంచం సొమ్మును సర్వేయర్‌ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. సర్వేయర్‌ రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షలో పాజిటివ్‌ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. ఇద్దరు అధికారులు తమ విధులను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించినట్లు ఎసిబి పేర్కొంది.మండల సర్వేయర్‌ బతుక శ్రీనివాసులు, తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించడం లేదని ఏసీబీ స్పష్టం చేసింది.ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్‌ నంబర్‌ 9440446106 ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను రహస్యంగా ఉంచుతామని వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button