PoliticalSiddipetaTelangana

ఏసీపీ ఆఫీసులో మహిళ ఆత్మ*హత్యాయత్నం...

ఏసీపీ ఆఫీసులో మహిళ ఆత్మ*హత్యాయత్నం...

ఏసీపీ ఆఫీసులో మహిళ ఆత్మ*హత్యాయత్నం…

Web desc : సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ మహిళ గజ్వేల్ ఏసీపీ కార్యాలయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్ లో కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపిన వివరాల ప్రకారం.. రాయపోల్ మండలం అహ్మద్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ బేగం బీ (37) సోమవారం మధ్యాహ్నం గజ్వేల్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో ఏసీపీ మరో ఫిర్యాదుదారుడితో మాట్లాడుతున్నారని, కొద్దిసేపు వేచి ఉండాలని కార్యాలయంలోని కానిస్టేబుల్ ఆమెకు సూచించారు.

దీంతో తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందు ప్యాకెట్‌ను తెరిచి, అందులోని మందును ఆమె తాగినట్లు ఏసీపీ వెల్లడించారు. కుటుంబ కలహాలతో గతంలో కేసు నమోదు బేగం బీ గతంలోనూ రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత ఏడాది ఆమె తన భర్తపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారని, ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణలో ఉందని పేర్కొన్నారు.

అలాగే, ఇంటి పక్కన నివసించే వారితో ఆమెకు తరచూ వివాదాలు తలెత్తేవని, ఈ క్రమంలో ఆమెపై ఇప్పటికే మూడు కేసులు నమోదైనట్లు ఏసీపీ వివరించారు. ఆమె అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణకు సంబంధించి కూడా కేసు ఉన్నట్లు తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసం ఆమె తరచూ రాయపోల్ పోలీస్ స్టేషన్‌కు వస్తుండేవారని, పోలీసులు సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఏసీపీ కార్యాలయంలో ఎలుకల మందు తాగిన వెంటనే బేగం బీని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు నర్సింలు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

పోలీసులను బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నంలో భాగంగా గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొంటూ, తాజా ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button