
మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముగ్గురు విదేశీ మహిళల అరెస్ట్
Web desc : నగరంలోని మాదాపూర్‌లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. వీరు ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందిన వారుగా గుర్తించారు.
మాదాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో విదేశీ మహిళలతో నాయక్ అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అపార్ట్‌మెంట్‌పై ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ క్రమంలో ముగ్గురు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు నాయక్ పరారీలో ఉన్నాడు.
ముగ్గురు విదేశీ మహిళల వద్ద సరైన గుర్తింపు పత్రాలు లేనట్లు పోలీసులు గుర్తించారు. వీరు తొలుత నేపాల్‌కు.. అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిర్వాహకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




