
గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం…
భద్రాచలంలో ఇంటర్ చదువుతున్న బాలిక
భద్రాచలం గిరిజన గురుకులంలో బైపీసీ ఫస్టియర్ చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం రాత్రి 60 ట్యాబ్లెట్లు మింగింది.అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై గురుకులం అధికారులు విచారణ ప్రారంభించారు. విద్యార్థినికి ట్యాబ్లెట్లు ఎలా లభించాయి? ఆత్మహత్యాయత్నానికి కారణాలేమిటి? ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.




