KhammamPoliticalTelangana

బాల్య వివాహాలతో బాలల భవిష్యత్తుకు ముప్పు

బాల్య వివాహాలతో బాలల భవిష్యత్తుకు ముప్పు

బాల్య వివాహాలతో బాలల భవిష్యత్తుకు ముప్పు

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు నవంబర్ 20 2026: విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలని, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. చైల్డ్ రైట్స్ వీక్ (CRC Week)లో భాగంగా కామేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏన్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ వాసవి దేవి, ఎస్సై సంధ్య మాట్లాడుతూ బాల్య వివాహాలు చిన్నారుల విద్యాభ్యాసానికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తాయని పేర్కొన్నారు.

విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. గుర్తుతెలియని లింకులు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సీడీపీఓ ఉమా మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. బాలలు వేధింపులకు గురైనా, ఆపదలో చిక్కుకున్నా తక్షణ సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button