
జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ సామాగ్రి జప్తు..!!!
కోర్టు ఆదేశాల మేరకు జనగామ జిల్లా వ్యవసాయ శాఖ (డీఏఓ) కార్యాలయంలోని సామాగ్రిని జప్తు చేసారు.
బాధితుడు కత్తుల రాజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన దీప్తి ఇంజినీరింగ్–వెల్డింగ్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. సుమారు తొమ్మిదేళ్ల క్రితం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ట్రాక్టర్‌కు సంబంధించిన పరికరాలను లబ్ధిదారులకు రాయితీపై అందజేసింది.
ఈ పరికరాలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ, సంబంధిత అధికారులు, సిబ్బంది వాటిని గుత్తేదారుకు చెల్లించకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని రాజిరెడ్డి తెలిపారు.
తనకు రావాల్సిన బిల్లుల చెల్లింపుపై పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పరిష్కారం కాలేదని, దీంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ..నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు వ్యవసాయ శాఖ కార్యాలయంలోని సామాగ్రిని జప్తు చేసినట్లు వెల్లడించారు.




