Telangana
Trending

గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా

గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా

గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్.

సమస్యలపై మంత్రులను కలిసిన ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అజ్మీర సుశీల భాయ్

సి కె న్యూస్ ప్రతినిధి

లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని సన్మానించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించగా వారం రోజుల్లో గిరిజన అధికారులను సమావేశ పరిచి సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
గిరిజన సంక్షేమ గురుకులoలొ గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగం చేస్తున్న 450 మంది నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని,12 నెలల జీతాలు అమలు చేయాలని ,450 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే 40,000 వేల తక్షిణ ఆర్థిక సాయం అందించాలి.

నాన్ టీచింగ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ 20 లక్షలు అందించాలాని, నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులేషన్ చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక వెంకటస్వామి ని ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు అజ్మీర సుశీల భాయి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ శ్రీనివాస్ నాయక్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు తేజావత్ రాందాస్ నాయక్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ధరావత్ కిషన్ నాయక్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు జర్పుల రాజ్ కుమార్ నాయక్,ఖమ్మం మహిళా జిల్లా అధ్యక్షురాలు ధారావత్ జ్యోతిబాయ్ , ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి తేజావత్ స్వాతి భాయ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వాంకుడోత్ శేఖర్ నాయక్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు జరుపుల రాజ్ కుమార్ నాయక్, జరుకుల దసరు నాయక్, జరుపుల యేసు కుమార్, భూక్య గోపి నాయక్, బానోత్ దేవేందర్ నాయక్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీర మాన్ సింగ్ నాయక్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button