PoliticalTelangana

పోలీస్ కస్టడీ నుంచి కానిస్టేబుల్ పరారీ కలకలం

పోలీస్ కస్టడీ నుంచి కానిస్టేబుల్ పరారీ కలకలం

పోలీస్ కస్టడీ నుంచి కానిస్టేబుల్ పరారీ కలకలం

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన ఒక కానిస్టేబుల్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేష్‌పై మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గురువారం పోక్సో కేసు నమోదయింది. గురువారం మహేష్‌ను నిజామాబాద్ ఇన్చార్జి ఏసిపి, రూరల్ సౌత్ సీఐలు విచారించి కేసు నమోదు చేశారు.

శుక్రవారం పోలీస్ స్టేషన్ కు రప్పించి కస్టడీలోకి తీసుకోగా అందరూ గణతంత్ర వేడుకల్లో ఉండగా మహేష్ తప్పించుకు పారిపోయాడు. మహేష్‌పై గత ఏడాది పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.భార్యాభర్తల వివాదంలో తల దూర్చినందుకు అప్పటి కమీషనర్ అతనిపై వేటు వేశారు.

అయితే తిరిగి అదే పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ తెచ్చుకున్న మహేష్ తన తీరు మార్చుకోకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక సంఘటన సంబంధించి విచారణ కోసం వెళ్లి మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మైనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కస్టడీ తీసుకుంటుండగాని పారిపోవడం విశేషం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button