PoliticalTelangana

నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై

నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై

నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై హరీష్ గౌడ్

సి కే న్యూస్ చేగుంట రిపోర్టర్ కొండి శ్రీనివాస్

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నేడు పోలీస్ స్టేషన్ లో పట్టణ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు చేగుంట ఎస్సై హరీష్ గౌడ్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడు కేసుల గురించి ఏ వివాదానికి ఏఏ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేస్తారో విద్యార్థులకు వివరించడం జరిగింది.

అదేవిధంగా తొలి ప్రాథమిక నివేదికలో ఏ అంశాలు నమోదు చేయాలో, అత్యవసర సమయంలో పోలీస్ వాళ్ళు తో,ఏ విధంగా సంప్రదించాలని, తమకు అన్యాయం జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి భయాందోళనలకు లోను కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని వారు అన్నారు.

మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది చేయు పనులను, స్టేషన్ లో నమోదు చేయు రికార్డులను చూపిస్తూ విద్యార్థులకు వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లు రవీందర్,రాంబాబు, కాన్స్టేబుల్ లు భాస్కర్, రేణుక, ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్, రఘుపతి, చక్రధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button