
కమిషనర్ సునీల్ దత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ మళ్లింపులు మరియు ఆంక్షలు అమలు
ఖమ్మం ట్రాఫిక్ పోలీసుల ముఖ్య గమనిక
ఖమ్మం పట్టణం & ఖమ్మం రూరల్ లో ట్రాఫిక్ మళ్లింపులు – ప్రజలకు సమాచారం
ఈనెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులు ఖమ్మం పట్టణం మరియు ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ఈ పర్యటన సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ శ్రీ సునీల్ దత్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం నగరం మరియు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు మరియు ఆంక్షలు అమలు చేయబడతాయి.
వాహనదారులు తప్పనిసరిగా ఈ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలని కోరడమైనది.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు
ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
(రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, అశ్వరావుపేట, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు)
కల్లూరు –వైరా నుండి సోమవారం విలేజ్ దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి– కొడుమూరు దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే దిగి– అల్లిపురం → కొత్తగూడెం → బోనకల్ రోడ్ —
ధంసలపురం బ్రిడ్జి కింద నుంచి
మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి పొన్నికల్లు ద్వారా హైదరాబాద్ వెళ్లాలి.
హైదరాబాద్ నుంచి భద్రాచలం / కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలు
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా,వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద హైవే దిగాలి ఇక్కడి నుండి ప్రకాశ్ నగర్ బ్రిడ్జి → చర్చి కాంపౌండ్ → ముస్తఫా నగర్ → అల్లిపురం — కోడుమూరు నుంచి మళ్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి వెళ్లిపోవాలి
సత్తుపల్లి / అశ్వరావుపేట నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు
ఖమ్మం కలెక్టరేట్ దాటిన తర్వాత
ఎస్ఆర్ గార్డెన్ → రఘునాథపాలెం (ఆపిల్ సెంటర్),
లింగాల → డోర్నకల్ → మహబూబాబాద్ → వరంగల్ వెళ్లాలి
ఇల్లందు నుంచి ఖమ్మం పట్టణంలోకి వచ్చే వాహనాలు
రఘునాథపాలెం ఆపిల్ సెంటర్ నుంచి,ఎస్ఆర్ గార్డెన్ → గోపాలపురం → గొల్లగూడెం → లకారం ద్వారా ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించాలి.
వరంగల్ నుంచి ఖమ్మం / సత్తుపల్లి / కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు
ఎదులాపురం ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ → నాయుడుపేట → గాంధీ చౌక్,
చర్చి కాంపౌండ్ → ముస్తఫా నగర్ → అల్లిపురం — కోడుమూరు — మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాలి.
ప్రజలకు విజ్ఞప్తి
ఈనెల 18వ తేదీన ఖమ్మం సిటీ మరియు ఖమ్మం రూరల్ పరిధిలో
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున,
👉 అత్యవసర పనులు ఉంటే తప్ప వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని
👉 ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని
ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




