HyderabadPoliticalSPORTSTelangana

క్రీడా ప్రాంగణంపై కన్నేసిన ఆక్రమణదారులు?

క్రీడా ప్రాంగణంపై కన్నేసిన ఆక్రమణదారులు?

క్రీడా ప్రాంగణంపై కన్నేసిన ఆక్రమణదారులు?

ప్రభుత్వ క్రీడా స్థలాన్ని కాపాడాలని వినతిపత్రం

పటాన్చెరు, జూన్ 22(సికే న్యూస్ ప్రతినిధి):

బొల్లారం డివిజన్ పరిధిలోని బీరప్ప బస్తీలో సర్వే నంబర్ 284లో ఉన్న 0.27 ఎకరాల తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని స్థానికులు అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు టి. రవీందర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, ప్రభుత్వం గ్రామీణ యువత క్రీడా అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ క్రీడా ప్రాంగణ స్థలం ప్రస్తుతం కొందరు వ్యక్తుల చేత అన్యాక్రాంతమైందని, వారు తమ స్వలాభం కోసం స్థలాన్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయమై ఇప్పటికే మండల రెవెన్యూ అధికారిని కలిసి ఫిర్యాదు చేయగా, సంబంధిత చర్యల కోసం డిప్యూటీ కమిషనర్‌ను సంప్రదించాలని సూచించినట్లు తెలిపారు.
అందువల్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించి, క్రీడా ప్రాంగణ స్థలంలో ప్రైవేట్ వ్యక్తుల కార్యకలాపాలను నిలిపివేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button