
భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్..
ఏసీబీ అధికారుల విచారణలో వెలుగులోకి నిజాలు
భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఎస్ఆర్ఓ ఖదీర్‌ను అరెస్ట్ చేశారు.
విచారణ అనంతరం ఏసీబీ, డీఎస్పీ రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న ఖదీర్,
గతంలో బూర్గంపాడు మండలం లో సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు 2025 జూన్ నెలలో ఆకస్మికంగా ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
అప్పుడు నిర్వహించిన తనిఖీల్లో ఎస్ఆర్ఓ బ్యాంకు ఖాతాకు పలు అకౌంట్స్ నుంచి నగదు బదిలీ అయిందని వాటిలో కార్యాలయం సిబ్బంది అకౌంట్లు కూడా ఉన్నాయని, నగదు బదిలీ జరిగినవి లంచంగా స్వీకరించినట్లు తెలియడంతో గురువారం పూర్తి స్థాయి విచారణ చేపట్టడం జరిగిందని అన్నారు.
తమ విచారణలో నిజాలు బయటపడటంతో ఎస్ ఆర్ ఓ ఖధీర్ ని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు.




