Andhra PradeshPolitical

మాజీ మంత్రి అరెస్ట్…

మాజీ మంత్రి అరెస్ట్…

మాజీ మంత్రి అరెస్ట్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంతకుముందే అరెస్ట్‌పై అంబటి రాంబాబు స్పందించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే, జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

“మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను.. ఐ డోంట్ కేర్ చంద్రబాబు” అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు మీద హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గూండాలు ఈ దాడి చేశారంటూ ఆరోపించారు.

ఈ ఘటనలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్న జగన్.. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button