
కేసీఆర్ మెడలు వంచింది నేనే.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు కష్టపడి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
నేను కేసీఆర్‌ని గజగజ వణికించా.. ‘నేను కేసీఆర్‌ని గజగజ వణికించా. నా తలకాయను కేసీఆర్.. ఆరు ముక్కలు చేస్తానని గతంలో అన్నారు. ఆయన సంగతి తేల్చేందుకు ఫామ్‌హౌస్‌కు వస్తానని చెప్పా.
ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను బజార్‌కు లాక్కొచ్చా. కేసీఆర్ మెడలు వంచింది నేనే. నేను ఎవరికీ భయపడను. గడీల నుంచి కేసీఆర్‌ను నేనే బయటకు తీసుకువచ్చా’ అని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.



