
కాంగ్రెస్లో కల్లోలం.. టికెట్ రాలేదని రోదించిన మహిళా నాయకురాలు
మెట్పల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత మంగళవారం జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో తనకు మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ 24 వార్డు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైంది.ఈ తరుణంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.విజయలక్ష్మి ఓదార్చింది.
ఆమె మాట్లాడుతూ.. ఉదయం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య ఫోన్ చేసి బీ ఫామ్ తీసుకెళ్లామని చెప్పి, ఇప్పుడు లిస్ట్ లో పేరు లేదనటం ఎంత వరకు సమంజసం అని కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం పై జువ్వాడి నర్సింగరావును అడుగగా నేనేం చేయలేనని చేతులేత్తేశారంటు రోదించింది.
గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ఎంతో కృషి చేశానని పట్టణ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇలా చేయడం సరికాదు అంటూ ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.




