PoliticalTelangana

ఆర్టీసీ బస్సు కు తృటిలో తప్పిన ప్రమాదం...

ఆర్టీసీ బస్సు కు తృటిలో తప్పిన ప్రమాదం...

ఆర్టీసీ బస్సు కు తృటిలో తప్పిన ప్రమాదం…

ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు టైర్ బ్లాస్ట్

జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పై శుక్రవారం బస్సు ప్రమాదానికి గురైంది. హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు వస్తున్న బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ కి ఢీకొనడం జరిగింది.ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహకరించారు.

అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, గాయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button