KhammamPoliticalTelangana

పోస్టల్ శాఖలో భూక్యా ఉమాకు మరో ఉద్యోగం…

పోస్టల్ శాఖలో భూక్యా ఉమాకు మరో ఉద్యోగం…

పోస్టల్ శాఖలో భూక్యా ఉమాకు మరో ఉద్యోగం…

అంతర్జాతీయ బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారిని బోనకల్ గ్రామానికి చెందిన భూక్య ఉమ శుక్రవారం వెలువడిన పోస్టల్ ఫలితాలలో పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. గతంలో కూడా స్పోర్ట్స్ కోటాలో కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖలో పోస్టు మాన్ గా ఉద్యోగం సాధించింది.

శుక్రవారం వెలువడిన పోస్టల్ ఫలితాలలో మరల అదే శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఉమా ఉద్యోగం సాధించింది.

ఉమకు తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చినందుకు బోనకల్ మండల సీనియర్ క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ లో శనివారం బుక్య ఉమా విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదట స్టార్ ఆఫ్ ఇండియా గ్రహీత అవార్డును కూడా పొందానన్నారు.

ఆ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రవీంద్ర గౌడ్, మండల పరిధిలోనే ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బాల్ బ్యాట్మెంటన్ కోచ్ అమరేసి లింగయ్య సహకారం మరువలేనిది అన్నారు.

వారు అందించిన సహకారంతోటే పోస్టల్ శాఖలో స్పోర్ట్స్ కోటాలో రెండు ఉద్యోగాలు సాధించానని తెలిపారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్, రాష్ట్ర బాల్ బ్యాట్మెంటన్ సంఘానికి , జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. గ్రామీణ బాల్ బ్యాట్మెంటన్ క్రీడకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహాయ సహకారాలు అందించాలని కోరారు. చేయాలని కోరుతున్నారు.

చెడు దురాలవాట్లకు పాల్పడి క్రీడాకారులు నష్టపోవద్దని, విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని ఆమె సూచించారు. బుక్య ఉమకు బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతి ఉపసర్పంచ్ బానోతు కొండ తదితరులు అభినందనలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button