KhammamPoliticalTelangana

నాగులవంచలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజలకు ఆరోగ్య సేవలు…

నాగులవంచలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజలకు ఆరోగ్య సేవలు…

నాగులవంచలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజలకు ఆరోగ్య సేవలు…..

సి కే న్యూస్

చింతకాని : నాగులవంచ గ్రామంలో ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో, జంగాల రాజేశ్వరరావు ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉచిత మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, ఇటువంటి సేవా కార్యక్రమాలకు పంచాయతీ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.

సాయిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖమ్మం వైద్యులు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు.

ఈ శిబిరంలో డా. ప్రియాంకతో పాటు వైద్య సిబ్బంది, రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు వెలిగేటి చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి గుడిమల్ల సూర్యప్రకాశరావు, సభ్యులు సాధినేని జనార్దన్ రావు, గోవర్ధన్ రావు, జల్లా వెంకటేశ్వర్లు, గజేంద్రుల నాగేశ్వరరావు, మూలగుండ్ల శ్రీహరి, ఉప్పలయ్య, సాయి, మాజీ ఎంపిటిసి కంభం సరోజినీ, విశ్రాంత ఉపాధ్యాయులు అంబటి శాంతయ్య, గ్రామ పెద్దలు ఆలస్యం నారాయణ, మధ్దినేని వెంకటేశ్వర్లు, కోలేటి చిన్న బ్రహ్మయ్య, కాముని కోటయ్య, సిరిసాని రమణ ప్రసాద్ (బాబు) తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button