KhammamPoliticalTelangana

సికె న్యూస్ కథనానికి స్పందన… సమస్యను పరిష్కరించిన సిబ్బంది

సికె న్యూస్ కథనానికి స్పందన… సమస్యను పరిష్కరించిన సిబ్బంది

సికె న్యూస్ కథనానికి స్పందన… సమస్యను పరిష్కరించిన సిబ్బంది

సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 11 2026: ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి లీకేజీ సమస్యపై సికె న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు.

కాలనీలో వృథాగా పారిపోతున్న నీటి సమస్యను గుర్తించిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మత్తు పనులు చేపట్టారు.

లీకేజీ కారణంగా రోడ్డుపై నిల్వ ఉన్న మురికి నీటిని తొలగించి పైపులను సరిచేసే చర్యలు చేపట్టారు. దీంతో కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి. సమస్యను పరిష్కరించడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన సికె న్యూస్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button