
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. 20 మందికి తీవ్రగాయాలు!
తెలంగాణలో దారుణం జరిగింది. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదానికి గురైంది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది.
హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బాధితులలో పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



