
కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ
Web desc : హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల హాస్టల్ ప్రాంగణంలో చికెన్ కూర పంపకాల విషయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి మొదలై తలెత్తిన గొడవ కర్రలతో తలలు పల్లగొట్టుకునే వరకు దారి తీసింది.
గతంలో మాదిరిగా కాకుండా ఫస్ట్ ఇయర్ కాలేజీ హాస్టల్ రెండు ఒకటే ప్రాంగణంలో ఉండేసరికి స్టూడెంట్ బెస్ట్ హాస్టల్ లో విద్యార్థులకు కాలేజీ హాస్టల్ న్యూ పీజీ విద్యార్థులకు నిన్న లంచ్ తర్వాత మిగిలిన చికెన్‌ను పంచుకోవడంలో గొడవ మొదలై సమస్య పోయింది.
ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హాస్టల్ తో పాటు మరో మూడు కమిటీ విద్యార్థుల నిర్వహణలో ఈ నెల హాస్టల్ మెనూ నిర్వహించబడుబడుతోంది.
మధ్యాహ్నం లంచ్ సమయంలో ఎంబీఏ విద్యార్థులు రెండు కప్పుల చికెన్ తీసుకుపోయారని అది సరిపోక మళ్లీ వచ్చి అడగడంతో నిర్వహణ కమిటీ వాళ్లు ఉన్న కూరలు చికెన్ కర్రీ మిగతా విద్యార్థులందరికీ సరిపోదు మిగిలితే తర్వాత తీసుకపోండి, అని చెప్పి చెప్పడంతో ఎంబీఏ విద్యార్థులు ఆగ్రహించి గొడవ పెట్టుకుని వెళ్లిపోయారని ఒక విద్యార్థి తెలిపారు.
ఒక ట్రే గుడ్లు మిగిలితే మళ్ళీ తీసుకెళ్తామని అనడంతో హాస్టల్ కమిటీ నిరాకరించింది. దీంతో మొదటి సంవత్సరం ఎంబీఏ విద్యార్థులు ఆగ్రహంతో రెండవ సంవత్సరం విద్యార్థులను సహాయంగా తీసుకొని వచ్చి 107 లో ఉన్న విద్యార్థిని రజనీకాంత్ ను కొట్టడంతో ఎకనామిక్స్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎకనామిక్స్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఫోన్ చేసి మాపైన దాడి జరుగుతోంది.
దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి అని బతిలాడడంతో రెండవ సంవత్సరం ఎకనామిక్స్ విద్యార్థి ఒకరు పోలీసులకు సమాచారం. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు సమాచారం అందించి 107వ రూమ్ నెంబర్ కి వెళ్లడంతో.. అది గమనించిన ఎంబీఏ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తంగా ఒక 60 మంది ఏకమై హాస్టల్ డోర్లు మూసి సదరు విద్యార్థిని ఎకనామిక్స్ విద్యార్థి రజనీకాంత్ ను చితకొట్టినట్లు రెండవ సంవత్సరం ఎకనామిక్స్ విద్యార్థులు తెలిపారు.
సమాచారం అందుకున్న కేయూ ఎస్ఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు హాస్టల్ ప్రాంగణంలోకి చేరుకొని ప్రవేశించే క్రమంలో అది గమనించిన ఎంబీఏ విద్యార్థులు మెయిన్ డోర్ క్లోజ్ చేయడంతో వారు అక్కడే నిలబడి పోవాల్సి రావడంతో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వాళ్లే ఏదో విధంగా దారి తీసుకొని పోలీసుల కోసం హాస్టల్ డోర్స్ ఓపెన్ చేసినట్లు తెలిపారు.
బాధిత విద్యార్థిని వ్యాన్ లో కూర్చుంటే పెట్టుకొని తీసుకెళ్తుండగా వ్యాన్ కు అడ్డంగా కూర్చున్నారని ఎకనామిక్స్ విద్యార్థులు తెలిపారు. ఎకనామిక్స్ విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఫిర్యాదు చేసేసరికి ఎంబీఏ విద్యార్థులు తిరిగి గొడవ ప్రయత్నించడంతో ఎకనామిక్స్ విద్యార్థులు ఎంబీఏ విద్యార్థులు ఒకరిపై ఒకరు తలలు పగిలేలా దాడి చేసుకోవడంతో సమాచారం అందుకున్న కేయూ పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తమ సిబ్బందితో గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కూడా ఇరువర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతను తగ్గించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




