HyderabadPoliticalTelangana

కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం

కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం

కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన జనం

హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానంద నగర్ లో ఫైర్ యాక్సిడెండ్ సంభవించింది. మంగళవారం (ఫిబ్రవరి 24) షాక్ సర్క్యూట్ తో కరెంటు స్తంభం అంటుకుంది.

దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పోల్ తో పాటు కరెంటు తీగలు, ఇతర కేబుల్స్ అంటుకుని తెగి పడిన దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి.

షాక్ సర్క్యూట్ కారణంగా కరెంటు పోల్ పై మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద వైర్లు, కేబుళ్లు అంటుకుని కరిగి పోయి కిందికి పడిపోయాయి.

దీంతో వైర్లు మీద పడుతాయేమోనని స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. కరెంటు తీగలు అంటుకోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది.

స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు పోలీసులు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగట పోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button