KhammamPoliticalTelangana

స్థానిక కేజీబీవీ పాఠశాలలో హెచ్పీవీ టీకాపై అవగాహన కార్యక్రమం

స్థానిక కేజీబీవీ పాఠశాలలో హెచ్పీవీ టీకాపై అవగాహన కార్యక్రమం

స్థానిక కేజీబీవీ పాఠశాలలో హెచ్పీవీ టీకాపై అవగాహన కార్యక్రమం

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 26 2026: స్థానిక కేజీబీవీ పాఠశాలలో బాలికల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి హెచ్పీవీ టీకాపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బి. రాములు పాల్గొని బాలికలకు హెచ్పీవీ టీకా ప్రాముఖ్యతను సవివరంగా వివరించారు.
14 నుండి 15 సంవత్సరాల వయస్సులో ఈ టీకా తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖ క్యాన్సర్‌కు ముందస్తు రక్షణ కల్పించవచ్చని తెలిపారు. అలాగే ఈ టీకా వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు ఈ టీకా తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 85 నుండి 90 శాతం వరకు తగ్గించుకోవచ్చని తెలియజేశారు.
ఈ టీకాను ప్రైవేటుగా వేయించుకుంటే సుమారు నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, అయితే ప్రభుత్వం 2026 సంవత్సరం నుండి ఈ టీకాను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ టీకాను వైద్యుల పర్యవేక్షణలో ఒక్క మోతాదుగా వేయడం జరుగుతుందని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉన్న వ్యాధిగా గుర్తించబడిందని, సరైన వయస్సులో ఈ టీకా తీసుకోవడం ద్వారా దాదాపు 90 శాతం వరకు ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది కలిసి యవ్వన దశలో ఉన్న బాలికలకు ఈ టీకా వేయించేందుకు ప్రోత్సహించడం ఎంతో అవసరమని సూచించారు.
గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలన దిశగా ఈ టీకా ఎంతో ఉపయోగకరమని వైద్యాధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య నర్సు పుణ్యవతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం రమణ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button