HyderabadPoliticalTelangana

చెరువులో శవమై తేలిన చిన్నారి

చెరువులో శవమై తేలిన చిన్నారి

చెరువులో శవమై తేలిన చిన్నారి

రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి చెరువులో ఈరోజు శవమై తేలింది.

ప్పుపాలగూడకు చెందిన చిన్నారి మోక్షిత 19 నెలలు మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ఇంటి ముందు ఆడుకుంటూ ఆదృశ్య మైంది. తల్లిదండ్రులు చుట్టపక్కల ప్రాంతాల్లో వెతికినా.. ప్రయోజనం లేకుండా పోయింది.

ఆ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.అయితే.. స్థానికంగా ఉన్న ముస్కు చెరువులో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రమాదవశాత్తు చిన్నారి చెరువులో పడిందా..? లేక ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా..? అనేది తెలియాల్సి ఉంది. చెరువుకు చిన్నారికి దాదాపు అర కి.మీ దూరం ఉంటుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చెరువు వద్దకు ఎలా వచ్చింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ గారాలపట్టిని ఎవరో చంపి చెరువులో పడేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button