HyderabadPoliticalTelangana

గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను రికార్డులపై మంత్రి సీతక్క ఫైర్...

గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను రికార్డులపై మంత్రి సీతక్క ఫైర్...

గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను రికార్డులపై మంత్రి సీతక్క ఫైర్…

గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై స్పష్టత – మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ మార్గదర్శకాలు

గత సర్పంచ్‌లు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ స్పష్టతనిచ్చింది.

ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీలకు టైడ్ కాంపొనెంట్ క్రింద రూ. 245.00 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి బేసిక్ అన్‌టైడ్ మరియు టైడ్ గ్రాంట్స్ కింద రూ. 640.07 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

గత సర్పంచ్‌ల పదవీకాలం 01.02.2024తో ముగిసిన నేపథ్యంలో, 2023-24 సంవత్సరానికి విడుదలైన టైడ్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే గ‌త స‌ర్పంచ్ ల‌కు బిల్లులు చెల్లించవచ్చని స్పష్టం చేశారు.

19.02.2026న జారీ చేసిన సర్క్యులర్ నం. CPR&RE-G1/SCHM/XVFC/2/2025 ద్వారా జిల్లాల పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. 2023-24 టైడ్ కాంపొనెంట్ కింద విడుదలైన నిధులపై గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను రికార్డులు సరిచూసి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా, గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న నిధుల నుంచి మల్టీ పర్పస్ వర్కర్లు (MPWs) వేతనాలు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు జిల్లాల స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button