
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. స్కూటీని ఢీకొట్టి పరారైన నిలోఫర్ డాక్టర్
Social media viral : హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 2వ తేదీన గాంధీనగర్ పీఎస్ పరిధిలో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని నిలోఫర్ ఆస్పత్రి మహిళా డాక్టర్ కారుతో ఢీకొట్టి పరారయ్యింది..
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ప్రమాదంపై బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి, ప్రమాదానికి గురైన కారును సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



