HyderabadPoliticalTelangana

భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య…

భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య…

భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య…

Web desc : హైదరాబాద్లోని ఉప్పల్ పరిధిలోని కురుమనగర్లో వివాహేతర సంబంధం వ్యవహారం కలకలం రేపింది. ఇంటి పనిమనిషితో భర్తకు అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ భార్య అతడిని బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన శివ (50), కుమారి (38)లు 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కొంతకాలం పాటు వారి కుటుంబ జీవితం సజావుగానే సాగింది. అనంతరం వారి ఇంట్లో పనిమనిషిగా చేరిన లక్ష్మితో శివకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని భార్య ఆరోపించింది.

ఈ విషయం తెలిసిన తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తాయని, గత ఐదేళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నట్లు సమాచారం.4 అయినప్పటికీ భర్త తన సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని భార్య ఆరోపించింది.

ఈ నేపథ్యంలో రాత్రి కురుమనగర్ లోని ఓ ఇంట్లో శివ, లక్ష్మి కలిసి ఉన్నారనే సమాచారం అందడంతో కుమారి తన బంధువులతో సమాచారం అందడంతో కుమారి తన బంధువులతో అక్కడికి చేరుకుంది. వారిని అక్కడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు శివకు దేహశుద్ధి చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

అనంతరం శివ, లక్ష్మిని పోలీస్ స్టేషన్కు తరలించారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ కుమారి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button