PoliticalTelanganaVikarabad

భర్త ప్రాణం తీసిన భార్య అక్రమ సంబంధం

భర్త ప్రాణం తీసిన భార్య అక్రమ సంబంధం

భర్త ప్రాణం తీసిన భార్య అక్రమ సంబంధం

Web desc: భార్య వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణం బలైంది. భార్య మరోకరితో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాకుండా ప్రియుడితో కలసి భర్తను వేధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మర్పల్లి మండలంలోని కొంశెట్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, రత్నమాల భార్య భర్తలు. అయితే రత్నమాల అదే గ్రామానికి చెందిన అనంత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తమ అక్రమ బంధానికి శ్రీనివాస్ అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్య, ఆమె ప్రియుడు అనంత్ కలసి రోజు వేధించేవారు. ఒకరోజు అతన్ని కట్టేసి కూడా అసభ్య పదాలతో తిట్టి వేధించారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాక తామెంత హింసించిన చావకుండా ఎందుకు ఉంటున్నావని తిట్టడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎస్సై రాహుఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంశెట్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, రత్నమాల భార్య భర్తలు. రత్నమాల అదే గ్రామానికి చెందిన అనంత్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. అయితే ఈ విషయం తెలిసి శ్రీనివాస్ ఆమెను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఎలాగు భర్తకు తెలిసింది కదా అని వారు మరింత రెచ్చిపోయారు. తమ చీకటి వ్యవహారానికి అడ్డుగా ఉన్నావని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. చావమంటూ ఆత్మహత్యకు ప్రేరేపించారు.

దీంతో అవమానం భరించలేక జీవితం పై విరక్తి చెందిన శ్రీనివాస్ ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన సోదరి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button