HyderabadPoliticalTelangana

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మ*హత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మ*హత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మ*హత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

Web desc : హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆత్మహత్యలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పని ఒత్తిడి కారణంగా కొందరు యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవడం విచారకరం.

తాజాగా కొండాపూర్‌లో జరిగిన ఒక విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ సుమధుర అపార్ట్‌మెంట్‌లో మనుశ్రీ (32) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఆమె.. ఐటీ ఉద్యోగం చేస్తూ నగరంలో నివాసం ఉంటోంది.

ఆదివారం రాత్రి నుంచి మనుశ్రీ తన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె పక్క గదిలో ఉండే ఆమె ఫ్రెండ్‌కు ఫోన్ చేశారు. సోమవారం ఉదయం ఆమె వెళ్లి చూడగా.. గది తలుపులు లోపల నుంచి వేసి ఉన్నాయి.

తలుపులు బద్దలు కొట్టి చూడగా.. మనుశ్రీ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button