
విధుల్లో నిర్లక్ష్యం చేసిన పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
ధర్మారం : విధుల్లో నిర్లక్ష్యం చేసిన పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్..గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం చేసిన ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.రవిని సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్కు ధర్మారం ఎంపిడిఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.రవి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీ ఇంటి పన్ను వసూళ్లలో 5,44,928/- రూపాయలకు కేవలం 63332/- రూపాయలు మాత్రమే వసూలు చేసి గ్రామ పంచాయతీ సాధారణ నిధికి జమ చేయకుండా నిధుల దుర్వినియోగం చేశారు.
ఈ నివేదిక పైన జిల్లా కలెక్టర్ అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని క్రమశిక్షణ చర్యలో భాగంగా తక్షణమే గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.రవిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



