
నాసిరకం భోజనంపై పోలీసులకు విద్యార్థుల ఫిర్యాదు
Social media viral: నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలలకు పాఠశాలలో వంట ఏజెన్సీ సంస్థ నాసిరకం భోజనం వడ్డించింది. దీంతో ఆగ్రహించిన బాలలు.. ఆ భోజనాన్ని డస్ట్ బిన్‌లో పడేశారు.
అనంతరం వంట ఏజెన్సీ నిర్వాహకులపై పోలీసులకు బాలలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని దేవుని చెరువులో మంగళవారం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా వంట ఏజెన్సీ వండిన ఆహారాన్ని పోలీసులు పరిశీలించారు.
ఇదే అంశంపై విద్య శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు అందడంతో.. వారు సైతం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మరో వైపు పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన భోజనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో వంట ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రలతోపాటు స్థానికులు, నెటిజన్లు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.



