
సంగారెడ్డి జిల్లాలో దంపతుల హ*త్య…
Web desc : సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటీజన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఘటన వివరాలిలా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిన్న(శుక్రవారం) రాత్రి వేళ నిర్మాణం వద్ద కాపాలాగా ఉండగా హత్యకు గురైన దంపతులను సోమ్లా దశరథ్ (50), మాన్యమ్మ (45)గా పోలీసులు గుర్తించారు. వీరు మహబూబాబాద్ జిల్లాలోని దొంగచింత తండా వాసులుగా గుర్తించారు.
సిటిజన్ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న భవనానికి వీరు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. రాత్రి సమయంలో భవనం వద్ద కాపలాగా ఉన్న తరుణంలో, గుర్తు తెలియని వ్యక్తులు దంపతులను దారుణంగా హత్య చేశారు.
రంగంలోకి క్లూస్ టీం..
సమాచారం అందుకున్న వెంటనే పఠాన్‌చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటన స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించడానికి క్లూస్ టీం సహాయం తీసుకున్నారు. నిందితులను గుర్తించేందుకు కాలనీ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారు.
మృతుల కుటుంబ నేపథ్యం, ఎవరితోనైనా వారికి గొడవలు ఉన్నాయా అనే కోణంలో స్థానికులను, సహచర కార్మికులను విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతి త్వరలోనే హంతకులను పట్టుకుంటామని పఠాన్‌చెరు పోలీసులు స్పష్టం చేశారు.




