
అశ్వారావుపేటలో నాలుగేండ్ల చిన్నారిపై 14 ఏండ్ల బాలుడి లైంగికదాడి
Web desc : నాలుగేండ్ల చిన్నారిపై 14 ఏండ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలో గురువారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలుడు ఓ ప్రైవేట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు.
ఉగాది సెలవులు కావడంతో గురువారం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ నాలుగేండ్ల చిన్నారిని ఆడించే నెపంతో ఇంట్లోకి తీసుకెళ్లాడు.
కొద్దిసేపటి తర్వాత పాప ఏడుస్తూ బయటకు రావడంతో గమనించిన చిన్నారి తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా.. లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.




