
బాధిత కుటుంబంను పరామర్శించిన ఎమ్మెల్యే
వనపర్తి పట్టణంలోని పలు బాధిత కుటుంబాలను బుధవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరామర్శించారు
25వ వార్డుకు చెందిన రిపోర్టర్ సిరాజుద్దీన్ ఇద్దరు కుమారులు ఇటీవల ఆకస్మికంగా మృతిచెందారు తీవ్ర షోకంలో ఉన్న సిరాజుద్దీన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే గారు పరామర్శించి చిన్నారుల మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు
నాలుగు సంవత్సరాల లోపు వయసు గల ఇద్దరు చిన్నారులు మృతి చెందడం దురదృష్టకరమును ఆయన ప్రగడ సానుభూతిని తెలియజేశారు
కొన్ని సంఘటనలు జీవితంలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయని ఇలాంటి కష్ట సమయంలో నిలదొక్కుకొని ముందడుగు వేయాలని వారికి ధైర్యాన్ని చెప్పారు
అనంతరం 3వ వార్డుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు యూసఫ్ అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్న ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి యూసఫ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు
మెరుగైన వైద్యం చేయించుకోవాలని వైద్యపరమైన సహాయ సహకారాలు అందజేస్తామని ఎమ్మెల్యే కుటుంబానికి భరోసా కల్పించారు
. మూడవ వార్డుకు చెందిన ప్రజా వైద్యశాల అంబులెన్స్ డ్రైవర్ గారి మాతృమూర్తి ఫజీలత్ బేగం ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే బుధవారం పరామర్శించారు
వారి తల్లి గారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు
అనంతరం మూడవ వార్డుకు చెందిన జమీల్ సాహెబ్ గారి 14 సంవత్సరాల వయసుగల కుమారుడు వలిద్ హుస్సేన్ మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు
అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు మృతి చెందుతే ఆ బాధ మర్చిపోలేము అని ఇలాంటి దురదృష్టకర పరిస్థితి ఎవరికి రాకూడదని ఎమ్మెల్యే వాపోయారు
. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పరమశించిన ఎమ్మెల్యే
నాగవరం తాండకు చెందిన మన్యం నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు
బుధవారం ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిలోనే మార్చురీలో గల మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు
సైకిల్ పై వెళ్తున్న సమయంలో అటుగా వెళుతున్న మరో వాహనం టైరు పగిలి సైకిల్ పై వెళ్తున్న మన్యం నాయక్ బలంగా తగలడంతో కూరగాయల పాలైన ఆయన మృత్యువాత పడ్డట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు
వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే కుటుంబానికి ప్రభుత్వ పరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందించేలా చూస్తామని కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని ఆయన సూచించారు
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ రవియాదవ్, మైనార్టీ నాయకుడు రహీం, లక్కాకుల సతీష్, జంపన్న యాదవ్, రఫీక్, ఇర్ఫాన్, వసీం, బషీర్ జహంగీర్, పాషా, అస్లాం, జమీల్, తిరుపతి యాదవ్, యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



