Andhra PradeshHealthPolitical

అధికారుల నిర్లక్ష్యంపై ఫుడ్ కమిషన్ మెంబర్ సీరియస్.. వరుస మెమోల జారీ!

అధికారుల నిర్లక్ష్యంపై ఫుడ్ కమిషన్ మెంబర్ సీరియస్.. వరుస మెమోల జారీ!

అధికారుల నిర్లక్ష్యంపై ఫుడ్ కమిషన్ మెంబర్ సీరియస్.. వరుస మెమోల జారీ!

Web desc : రేషన్ డిపోలు ,అంగన్వాడీలలో మిడ్ డే మీల్స్ ,హాస్టల్స్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ .బి కాంతారావు. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి ప్రాంతంలో పురుషోత్తపురం లో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాన్ని( 0316020 )తనిఖీ చేశారు.

పిల్లల హాజరు పట్టిలో అటెండెన్స్ లేకపోవడం, అదేవిధంగా స్టాక్ రిజిస్టర్ లో తప్పులు జరగడం మూలంగా ఈ కేంద్రం టీచర్ పై మెమో జారీ చేయమని అధికారులను ఆదేశించారు.

వరలక్ష్మి నగర్ లో ఉన్నటువంటి రేషన్ డిపో నెంబర్ (0386151) షాప్ లో అనధికారకంగా సబ్బులు షాంపూలు అమ్మడం అదేవిధంగా స్టాక్ బోర్డులో డీటెయిల్స్ పొందుపరచకపోవడం మూలంగా ఇతనిపై తగిన చర్యలు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

పాపయ్య రాజుపాలెం లో ఉన్నటువంటి షాప్ నెంబరు (0386419) అధికారికమైనటువంటి బోర్డు లేకపోవడం అదేవిధంగా స్టాక్ బోర్డు లేకపోవడం మూలంగా ఆయన కు మెమో జారీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. గొల్లవాని వాని పాలెం ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్ లో 40 గుడ్లు అదనంగా ఉండడం వల్ల స్కూల్ హెడ్మాస్టర్ ను ప్రశ్నించారు.

చిన్న ముషిడి లోని అంగన్వాడి కేంద్రం (0316008 )పిల్లల హాజరు పట్టిలో తప్పులు ఉండడం అటెండెన్స్ సరిగా వేయలేకపోవడం స్టాక్ రిజిస్టర్ లో గుడ్లు విషయంలో తప్పులు ఎక్కువగా ఉండటం మూలంగా ఈ కేంద్రంపై విచారం చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

అదేవిధంగా PM శ్రీ govt High school పెందుర్తి అక్కడ భోజనం రుచి చూసి నాణ్యత విషయంలో జాగ్రత్త వహించవలసిందిగా చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం , మెనూ ప్రకారం పిల్లలకి ఆహారం పెట్టవలసిందిగా అధికారులు ఆదేశించారు. మేఘాద్రి గడ్డ అంబేద్కర్ గురుకులం తనిఖీ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు ఆదేశించారు.

అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వారి మానసిక ఆరోగ్య పరిస్థితులపై దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ వారితో కలిసి భోజనం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button