
జూన్ 2 నాటికి జర్నలిస్ట్‌ల ఇళ్ల స్ధలాల సమస్యకు పరిష్కారం
న్యాయపరమైన చిక్కుల్లేకుండా ఇళ్లస్దలాల కేటాయింపు
ఈ రోజు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్, జర్నలిస్ట్స్ హౌసింగ్, డెక్కన్ జర్నలిస్ట్స్, తెలంగాణ హౌసింగ్ సొసైటీలతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే. అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు వచ్చే నెల 2వ తేదీ నాటికి ఇళ్ల స్థలాల విషయం ఒక కొలిక్కి తీసుకువస్తాం.
ఫ్యూచర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్స్ తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు.
జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మినహా మిగిలిన మూడు సొసైటీలలో సుమారు 2,424 మంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాం.
జర్నలిస్టులతో పాటు అన్ని సొసైటీలు కలిపి జేఏసీ ఏర్పాటు చేసుకుంటే ఇళ్ళ స్థలాల సమస్యల పరిష్కారం సులభతరమవుతుంది.
జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాని అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్ధలాల మంజూరు చేస్తాం.
ఈ సమావేశంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి , సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ జి.ముకుంద రెడ్డి , సిపీఆర్వో మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.



