AdilabadPoliticalTelangana

అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనం పట్టివేత

అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనం పట్టివేత

అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనం పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్, రిమాండ
03 ఆవులు, టాటా వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం
ఆవులను సురక్షితంగా గోశాలకు తరలింపు

పశువుల అక్రమ రవాణా చేసిన వారిపై చర్యలు తప్పవు

ఇచ్చోడ సిఐ సిహెచ్ రమేష్

ఆదిలాబాద్ జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు బక్రీద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక తనిఖీలలో భాగంగా నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చోడ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న వాహనం నంబర్ ను తనిఖీ చేయగా, అందులో (03) ఆవులను అత్యంత క్రూరంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
వాహనంలో ఆవుల మెడలు, కాళ్లు తాళ్లతో బిగించి, శ్వాస తీసుకోవడానికి కూడా వీలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వాహన డ్రైవర్ మరియు పశువుల యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు.

నిందితుల వివరాలు:

  1. షారుఖ్ ఖురేషి, నివాసం – నిర్మల్.
  2. మహ్మద్, నివాసం – గుడిహత్నూర్.

విచారణలో బజార్‌హత్నూర్ మండలం అనంతపూర్ గ్రామంలో తక్కువ ధరకు ఆవులను కొనుగోలు చేసి, నిర్మల్‌లోని కబేళాకు తరలించి అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని ఇచ్చోడ సీఐ సిహెచ్ రమేష్ తెలిపారు.

ఈ కేసులో పోలీసులు (03) ఆవులు, టాటా వాహనం, నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న ఆవులను సురక్షితంగా బజార్‌హత్నూర్ లోని శ్రీరామ్ గోశాలకు తరలించారు.

ఈ సందర్భంగా ఇచ్చోడ సి.ఐ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, క్రూరమైన పద్ధతుల్లో పశువులను తరలించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా కబేళాలకు తరలించే ఉద్దేశంతో చేసే గోవుల అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పశువుల పట్ల క్రూరంగా వ్యవహరించేవారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button