KhammamPoliticalTelangana

ఖమ్మం రూరల్ లో భారీ అగ్నిప్రమాదం.. 10 ఎకరాల పామాయిల్ తోట దగ్ధం

ఖమ్మం రూరల్ లో భారీ అగ్నిప్రమాదం.. 10 ఎకరాల పామాయిల్ తోట దగ్ధం

ఖమ్మం రూరల్ లో భారీ అగ్నిప్రమాదం.. 10 ఎకరాల పామాయిల్ తోట దగ్ధం

ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లపాడు గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 ఎకరాల పామాయిల్ తోట పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

బాధిత రైతులు షాబాద్ శ్రీనివాస్ రెడ్డి, షాబాద్ హనుమంతు రెడ్డి, మద్ది మల్లారెడ్డి లకు చెందిన పామాయిల్ తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా బూడిదై పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతుల మోటార్లు, స్టార్టర్లు, పైపులు కూడా మంటల్లో కాలిపోయాయని తెలిపారు.

భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన పామాయిల్ తోటలను ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట వీరభద్రం, ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి పరిశీలించారు.

బాధిత రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ డైరెక్టర్ పంతులు నాయక్, లింగా శ్రీనివాసరావు, షాబాద్ మాధవ రెడ్డి, తొండల రవి, సింగిరెడ్డి బోసి రెడ్డి, సింగిరెడ్డి రామిరెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, శ్యామల రామ్ రెడ్డి, రుద్ర ఉపేందర్, శావిడి కరుణాకర్, కొండం ప్రభాకర్, సంపేట శీను, పరికపల్లి సుదర్శన్, టీం పొంగులేటి పీఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్ ఆరేంపుల బద్రిసాయి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button