HyderabadPoliticalTelangana

సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు

సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు

సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షాబాద్ సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనే ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అతనిపై తగిన చavర్యలు తీసుకోకపోవడమే ఈ ఘోరానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాధిత మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గతంలోనే రాజ్‌కుమార్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదైనప్పటికీ నిందితుడిని సకాలంలో అరెస్టు చేయకపోవడాన్ని బాలిక కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

నిందితుడు రాజ్‌కుమార్‌కు షాబాద్ ఎస్సై క్రాంతి రెడ్డితో పాటు స్థానిక ఇన్స్పెక్టర్ కూడా లోపాయికారీగా సహకరించారని, పోలీసుల అండదండలు ఉండటం వల్లే అతను ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని బాధిత కుటుంబ సభ్యులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన సీపీ, ప్రాథమిక విచారణ అనంతరం ఎస్సై క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో పోలీసుల కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను పట్టిస్తే రూ.2లక్షల రివార్డు ఇస్తామని వెల్లడించారు. నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం 10 బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button