HyderabadPoliticalTelangana

ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే…!

ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే…!

ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే…!

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో జరిగిన ఆరుగురి హత్యోదంతంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘోర సామూహిక హత్య హృదయవిదారకమైనదని, ఈ ఘటనతో రాష్ట్రంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తి వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని దుయ్యబట్టారు.

న్యాయం కోసం బాధితులు నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలసిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ ఘటనలో ముగ్గురు అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఘోరం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని హరీష్ రావు విమర్శించారు.

హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఈ దారుణానికి సీఎం రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ఆయనకు కొంచెమైనా మానవత్వం ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు, అవినీతికి లొంగిపోవడం వల్లే నిందితుడికి బెయిల్ వచ్చిందని ఆరోపించారు. ఒక పోక్సో (POCSO) కేసు నిందితుడు ఇంతటి దారుణానికి ఒడిగడుతుంటే, నెల రోజుల పాటు పరారీలో ఉన్నా పోలీసులు అతడిని పట్టుకోలేకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. నిందితుడికి ప్రభుత్వం, పోలీసులు పరోక్షంగా సహకరించారని ఆరోపించారు.

ఈ కేసులో కేవలం ఒక ఎస్సైని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ప్రస్తుతం పోలీసులు శాంతిభద్రతలను పక్కనబెట్టి, ల్యాండ్ సెటిల్‌మెంట్ల కోసం ఒక రాజకీయ వ్యవస్థగా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు తమ ప్రతాపం చూపిస్తూ అడ్డుకోవడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.

తప్పు చేసిన దొంగలకు, హంతకులకు సహకరిస్తున్న పోలీసులు, పరామర్శించడానికి వెళ్లే విపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు.. హంతకులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.

ఈ ఘటనలో ఆ కుటుంబంలో ఒకే ఒక్క అమ్మాయి ప్రాణాలతో బతికిందని, ఆమె కూడా దివ్యాంగురాలని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆ దివ్యాంగ అమ్మాయి భవిష్యత్తు కోసం ఆమె పేరు మీద కోటి రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని హరీష్ రావు గట్టిగా డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button