NalgondaPoliticalTelangana

ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 40 మంది ప్రయాణికులు

ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 40 మంది ప్రయాణికులు

ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 40 మంది ప్రయాణికులు

నల్గొండ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. కానీ ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి నుంచి ఏపీలోని కాకినాడకు ఓ ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి బయల్దేరింది.

నల్లగొండ జిల్లాలో వెళ్తున్న సమయంలో అర్ధరాత్రి 2.15 గంటలో బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్.. బస్సును నిలిపివేశాడు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి.. కిందకు దించేశాడు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. బస్సు క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించక పోవడంతో బస్సు డ్రైవర్, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button