Telangana
Trending

ఇందిరమ్మ ఇఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామసభలో ఓ వ్యక్తి ఆత్మ*హత్యయత్నంల్లు రాలేదని గ్రామసభలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం

ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామసభలో ఓ వ్యక్తి ఆత్మ*హత్యయత్నం

ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామసభలో ఓ వ్యక్తి ఆత్మ*హత్యయత్నం

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కటారం మండలం ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామసభలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి యత్నించాడు. ఈ ఘటన కాటారం మండలం గుండాత్ పల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా గ్రామసభలో ఈ ఘటన కలకలం రేగింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపంతో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం నిర్వహించిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన నగునూరి శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పక్కనే ఉన్న వారు, అధికారులు కలుగజేసుకొని అతడికి నచ్చజెప్పారు.

నిరుపేదనైన తనకు అన్ని అర్హతలున్నా ఇళ్ల జాబితాలో పేరు లేకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించాడు. ఆస్తులు, బంగ్లాలు ఉన్న వారికే ఇండ్లు మంజూరు చేస్తారా? మా లాంటి నిరుపేదలు మీకు కనిపించరా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button