
SBIలో 7,150 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
నిరుద్యోగులకు దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మంచి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదికి గానూ అత్యంత భారీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది.అప్రెంటిస్‌షిప్ చట్టం, 1961 ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంక్ శాఖలు, ప్రాంతాలలో ఖాళీగా ఉన్న మొత్తం 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియాల్సి ఉండగా ఈ నెల 15 వరకు పొడిగించారు.
నోటిఫికేషన్ https://sbi.bank.in/web/careers/current-openings
ముంబైలోని కార్పొరేట్ సెంటర్‌లో ఉన్న ఎస్‌బీఐ సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు మే 19, 2026 నుండి ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 15, 2026 (ఈరోజే) చివరి తేదీ. అర్హత గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉంటుంది. పరీక్ష తేదీల షెడ్యూల్‌ను బ్యాంక్ త్వరలోనే విడిగా ప్రకటించనుంది.
అర్హతలు
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: ఏప్రిల్ 30, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే ముందు అభ్యర్థులు తమ అర్హతలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి:
రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు
ఎస్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు ప్రతి దశలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ (OBC), ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 300 గా నిర్ణయించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగుల (PWD) కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు (మినహాయింపు ఇచ్చారు). ఫీజును కేవలం ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించేటప్పుడు అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లోని అన్ని సూచనలను జాగ్రత్తగా చదివి పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.




