
ఖమ్మంలో బాలికపై అత్యాచారం… అపార్ట్‌మెంట్ పైనుంచి కిందకు తోసేసి
12 ఏళ్ల బాలికను అపార్ట్‌మెంట్‌పైకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం అక్కడి నుంచి కిందకు తోసేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో కేంద్రంలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మంలో జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో అపార్ట్‌మెంట్‌కు ఓ వ్యక్తి సెక్యూర్టీ గార్డుగా పని చేస్తూ తన భార్య, కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఓ వ్యక్తి బాలిక(12)కు మాయమాటలు చెప్పి అపార్ట్‌మెంట్ పైకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి అనంతరం అక్కడి నుంచి కిందకు తోసేశాడు. బాలిక తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బాలిక వెన్నుముక, చేతులు, కాళ్లు, పక్కటెముకలకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలతో బాలికపై లైంగిక దాడి జరిగినట్టు తెలియడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, బంధువుల డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నిందితుడిపై చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.




