Khammam
Trending

ముందు పాపను కాపాడుకుందాం.. నేనున్నా!

ముందు పాపను కాపాడుకుందాం.. నేనున్నా!

  • ఖమ్మం ఘోరంపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆవేదన
  • బాధితురాలికి ‘నిమ్స్’లో అత్యున్నత వైద్యం.. నిందితుడికి కఠిన శిక్ష తప్పదు

ఖమ్మం : ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. తల్లంపాడు గ్రామానికి చెందిన రేగళ్ల రమేశ్ కుమార్తెపై జరిగిన ఈ ఘాతుకం తనను తీవ్రంగా కలచివేసిందని, నిందితుడిపై తక్షణమే కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

బాధితులకు పూర్తి అండ..
విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగులేటి బాధిత బాలిక తండ్రితో, స్థానిక సర్పంచ్‌తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. “ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా” అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాప వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button